PVC pipes
-
ఆస్ట్రల్ పాలీ జోష్- యాంబర్ డౌన్
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసి పైపుల కంపెనీ ఆస్ట్రల్ పాలీటెక్నిక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో పనితీరు నిరాశపరచడంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ లాభాలతో కళకళలాడుతుంటే.. రికార్డుల మార్కెట్లోనూ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్ట్రల్ పాలీటెక్నిక్ నికర లాభం దాదాపు 7 శాతం బలపడి రూ. 88 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 10 శాతం పెరిగి రూ. 747 కోట్లను అధిగమించాయి. అధెసివ్స్ బిజినెస్ 29 శాతం ఎగసి రూ. 190 కోట్లకు చేరడం మెరుగైన పనితీరుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం పుంజుకుని 21 శాతాన్ని దాటాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రల్ పాలీటెక్నిక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్ చేసి రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.2 శాతం పురోగమించి రూ. 1,249ను తాకింది. యాంబర్ ఎంటర్ ప్రైజెస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో యాంబర్ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం 77 శాతం పడిపోయి రూ. 3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం నీరసించి రూ. 408 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.34 శాతం క్షీణించి 4.8 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం యాంబర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 2,193 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.3 శాతం వెనకడుగుతో రూ. 2,150ను తాకింది. -
అపోలో పైప్స్- కేఎస్బీ.. యమ స్పీడ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసీ పైపుల తయారీ కంపెనీ అపోలో పైప్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో పంప్ సెట్ల దిగ్గజం కేఎస్బీ లిమిటెడ్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అపోలో పైప్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అపోలో పైప్స్ నికర లాభం 64 శాతం ఎగసి రూ. 9.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 28 శాతం పుంజుకుని రూ. 123 కోట్లను అధిగమించింది. అమ్మకాల పరిమాణం 19 శాతం పెరిగి 12,268 టన్నులను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.55 శాతం మెరుగుపడి 14.19 శాతానికి చేరాయి. పీవీసీ, హెచ్డీపీఈ పైపులకు పెరిగిన డిమాండ్ కారణంగా పటిష్ట పనితీరును సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో అపోలో పైప్స్ షేరు ప్రస్తుతం 14 శాతం దూసుకెళ్లి రూ. 595 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 598ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వారం రోజుల్లో 29 శాతం ర్యాలీ చేసింది. కేఎస్బీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేఎస్బీ లిమిటెడ్ నికర లాభం రూ. 26 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు ఎగసింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాదిపదికన మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో కేఎస్బీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10.4 శాతం జంప్‌చేసి రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 శాతం దూసుకెళ్లి రూ. 540కు చేరింది. -
సబ్సిడీపై పీవీసీ పైపుల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఆహార భద్రత మిషన్, జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం కింద రైతులకు సబ్సిడీపై పీవీసీ పైపులు పంపిణీ చేయనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఎం కింద 201 యూనిట్లకు రూ.30.15 లక్షలు, ఎన్‌ఎంఓఓపీ కింద 222 యూనిట్లకు రూ. 33.3 లక్షలు సబ్సిడీ ఇస్తున్నట్లుగా జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. సబ్సిడీ 50 శాతం లేదా మీటరుకు రూ.35కు మించకుండా రూ. 15 వేల వరకు సబ్సిడీగా ఇస్తామని జేడీఏ స్పష్టం చేశారు. 63 ఎంఎం సైజు పైపుల పూర్తి ధర రూ.310 ఉండగా మీటరుకు సబ్సిడీ రూ.155, 75ఎంఎం సైజు పైపుల పూర్తి ధర రూ.445, 90 ఎంఎం పైపుల పూర్తి ధర రూ.628 , 110 ఎంఎం సైజు పైపుల ధర రూ. 110 ఉండగా మీటరుకు 210 ప్రకారం సబ్సిడీ ఇస్తామని వివరించారు. పీవీసీ పైపులను సబ్ డివిజన్ల వారీగా కేటాయించామని రైతులు సంబంధిత మండల వ్యవసాయాధికారులను సంప్రదించి పైపులు పొందాలని సూచించారు. జిల్లాకు స్పింక్లర్లు 911 యూనిట్లు మంజారు అయ్యాయని, వీటికి సబ్సిడీ రూ.91.10 లక్షలు మంజూరు అయిందని తెలిపారు. అయితే స్పింక్లర్లు, నల్ల పైపులకు ఇంతవరకు ధరలు ఖరారు కాలేదని తెలిపారు. ఈ సబ్సిడీని పీవీసీ పైపులకే మల్లించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
కాలిబూడిదైన ద్విచక్రవాహనాలు దగ్ధమైన ఎడ్లబండి పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి పట్టణం శాంతినగర్‌లో సోమవారం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రెండు ద్విచక్రవాహనాలు, 50పీవీసీ పైపులు కాలిబూడిదయ్యాయి. పొందుగుల కోటిరెడ్డి ఇంటిపై గల విద్యుత్ సర్వీస్వైర్ నుంచి ఎగిసిపడ్డ మంటలు సమీపంలోని గడ్డికుప్పపై పడ్డారుు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి కోటిరెడ్డికి చెం దిన షెడ్డులోకి చొచ్చుకొచ్చారుు. షెడ్డులో నిలిపి ఉంచిన రెండు ద్విచక్రవాహనాలు, ఎడ్లబండి మంటల్లో కాలిపోయూరుు. స్థానికులు అగ్నిమాపకశాఖాధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో రావడంతోనే పొరుగున ఉన్న ఇళ్లకు పెద్దప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.1.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. జాయింట్ వద్ద సర్వీస్ వైర్లు రాపిడీకి గురవడంతో నిప్పురవ్వలు ఎగిసిపడినట్లు స్థానికులు చెబుతున్నారు. -
ఆర్ట్ విత్ వేస్ట్
పగిలిపోరుున పీవీసీ పైపులు, కార్డ్‌బోర్డులు, చివికి చిరిగిపోరుున తువ్వాళ్లు, ఖాళీ సీసాలు.. మనం చెత్తగా భావించేవి ఏవైనా సరే, ఆయున చేతిలో పడ్డాయుంటే కళా రూపాలుగా మారాల్సిందే. వునం తుక్కు అనుకునే వాటితోనే ఆయున చక్కని కళాకృతులను తయూరు చేస్తారు. చెత్తతోనే మహత్తర కళారూపాలను సృష్టిస్తున్న ఈ కళాకారుడి పేరు కె.మురళీధర్. చిన్ననాటి నుంచి తనకు కళే ప్రాణవుంటున్న మురళీధర్, ప్రపంచంలో పనికిరాని వస్తువేదీ లేదంటారు. చెత్తతో కళాకృతుల రూపకల్పన కోసం ఆయున వుుఖ్యంగా వాడే ముడిపదార్థం క్లే (వుట్టి). ఇది పర్యావరణానికి ఏవూత్రం హాని చేయుదు. పిడిలైట్ కంపెనీ సౌజన్యంతో 2004లో తొలిసారిగా క్లే పెరుుంటింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో పలు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. విభిన్న కళా నైపుణ్యాలలో నిరంతర సాధన చేసే మురళీధర్, సికింద్రాబాద్‌లోని తన స్టూడియోలో స్కల్ప్చర్, త్రీడీ పెరుుంటింగ్లో ఆసక్తిగల వారికి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2,500 వుందికి శిక్షణ ఇచ్చానని, రాజస్థాన్, వుుంబై తదితర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వారూ తన వద్ద శిక్షణ పొందుతున్న వారిలో ఉన్నారని మురళీధర్ చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ హాస్టల్స్‌లో ఉంటూ తన వద్ద తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. శిరీష చల్లపల్లి