షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
కాలిబూడిదైన ద్విచక్రవాహనాలు
దగ్ధమైన ఎడ్లబండి
పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి పట్టణం శాంతినగర్‌లో సోమవారం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రెండు ద్విచక్రవాహనాలు, 50పీవీసీ పైపులు కాలిబూడిదయ్యాయి. పొందుగుల కోటిరెడ్డి ఇంటిపై గల విద్యుత్ సర్వీస్‌వైర్ నుంచి ఎగిసిపడ్డ మంటలు సమీపంలోని గడ్డికుప్పపై పడ్డారుు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి కోటిరెడ్డికి చెం దిన షెడ్డులోకి చొచ్చుకొచ్చారుు. షెడ్డులో నిలిపి ఉంచిన రెండు ద్విచక్రవాహనాలు, ఎడ్లబండి మంటల్లో కాలిపోయూరుు. స్థానికులు అగ్నిమాపకశాఖాధికారులకు సమాచారం అందించడంతో సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో రావడంతోనే పొరుగున ఉన్న ఇళ్లకు పెద్దప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.1.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. జాయింట్ వద్ద సర్వీస్ వైర్లు రాపిడీకి గురవడంతో నిప్పురవ్వలు ఎగిసిపడినట్లు స్థానికులు చెబుతున్నారు.