సబ్సిడీపై పీవీసీ పైపుల పంపిణీ
Published Sat, Nov 26 2016 11:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఆహార భద్రత మిషన్, జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం కింద రైతులకు సబ్సిడీపై పీవీసీ పైపులు పంపిణీ చేయనున్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం కింద 201 యూనిట్లకు రూ.30.15 లక్షలు, ఎన్‌ఎంఓఓపీ కింద 222 యూనిట్లకు రూ. 33.3 లక్షలు సబ్సిడీ ఇస్తున్నట్లుగా జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. సబ్సిడీ 50 శాతం లేదా మీటరుకు రూ.35కు మించకుండా రూ. 15 వేల వరకు సబ్సిడీగా ఇస్తామని జేడీఏ స్పష్టం చేశారు. 63 ఎంఎం సైజు పైపుల పూర్తి ధర రూ.310 ఉండగా మీటరుకు సబ్సిడీ రూ.155, 75ఎంఎం సైజు పైపుల పూర్తి ధర రూ.445, 90 ఎంఎం పైపుల పూర్తి ధర రూ.628 , 110 ఎంఎం సైజు పైపుల ధర రూ. 110 ఉండగా మీటరుకు 210 ప్రకారం సబ్సిడీ ఇస్తామని వివరించారు. పీవీసీ పైపులను సబ్ డివిజన్‌ల వారీగా కేటాయించామని రైతులు సంబంధిత మండల వ్యవసాయాధికారులను సంప్రదించి పైపులు పొందాలని సూచించారు. జిల్లాకు స్పింక్లర్లు 911 యూనిట్లు మంజారు అయ్యాయని, వీటికి సబ్సిడీ రూ.91.10 లక్షలు మంజూరు అయిందని తెలిపారు. అయితే స్పింక్లర్లు, నల్ల పైపులకు ఇంతవరకు ధరలు ఖరారు కాలేదని తెలిపారు. ఈ సబ్సిడీని పీవీసీ పైపులకే మల్లించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement