pumps
-
HYD Long Queues At Petrol Pumps:హైదరాబాద్‌లో వాహనదారులకు పెట్రో ట్రబుల్స్ (ఫొటోలు)
-
అపోలో పైప్స్- కేఎస్బీ.. యమ స్పీడ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసీ పైపుల తయారీ కంపెనీ అపోలో పైప్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో పంప్ సెట్ల దిగ్గజం కేఎస్బీ లిమిటెడ్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అపోలో పైప్స్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అపోలో పైప్స్ నికర లాభం 64 శాతం ఎగసి రూ. 9.5 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 28 శాతం పుంజుకుని రూ. 123 కోట్లను అధిగమించింది. అమ్మకాల పరిమాణం 19 శాతం పెరిగి 12,268 టన్నులను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.55 శాతం మెరుగుపడి 14.19 శాతానికి చేరాయి. పీవీసీ, హెచ్డీపీఈ పైపులకు పెరిగిన డిమాండ్ కారణంగా పటిష్ట పనితీరును సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో అపోలో పైప్స్ షేరు ప్రస్తుతం 14 శాతం దూసుకెళ్లి రూ. 595 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 598ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. వారం రోజుల్లో 29 శాతం ర్యాలీ చేసింది. కేఎస్బీ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేఎస్బీ లిమిటెడ్ నికర లాభం రూ. 26 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు ఎగసింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాదిపదికన మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 362 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో కేఎస్బీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10.4 శాతం జంప్‌చేసి రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 శాతం దూసుకెళ్లి రూ. 540కు చేరింది. -
నో హెల్మెట్, నో పెట్రోలు : ఈ రోజు నుంచే
సాక్షి, న్యూఢిల్లీ: ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో పరిధిలోని బైక్ రైడర్స్ హెల్మెట్ లేకుండా పెట్రోల్ స్టేషన్‌కు వెళితే అక్కడి సిబ్బంది పెట్రోల్ పోయరు. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్డు భద్రతను ప్రోత్సహించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు పెట్రోల్ పంపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతానికి ఈ అదేశాలను రెండు నగరాల్లో అమలు చేయాలని, అనంతరం ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని యజమానులను ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే, డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయడంతోపాటు, చట్టపరమైన చర్యలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని కలెక్టర్ సింగ్ తెలిపారు. అలాగే పెట్రోల్ బంకుల్లోని సిబ్బందితో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే రైడర్లను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 151 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. కాగా మోటారు వాహనాల చట్టం 129 సెక్షన్ ప్రకారం, హెల్మెట్ లేని ప్రయాణం నేరం. దీని ఉల్లఘించినవారికి 6 నెలలు జైలు శిక్ష విధించవచ్చు. -
రూ.5.5లక్షలకోట్లు విడుదల చేశాం..
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ ఇప్పటివరకూ రూ.5.50 లక్షల కోట్ల కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసిందని ఆర్థికవ్యవహారాల ముఖ్య కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. వీలైనంత త్వరగా మరింత కరెన్సీని బ్యాంకులకు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. రూ 5.50 లక్షల కోట్ల పాత నోట్లు రిజర్వ్ బ్యాంకుకు తిరిగివ వచ్చిన నేపథ్యంలోరూ.5.5 లక్షల కోట్ల తాజా కరెన్సీ నోట్లను మార్కెట్ లోకి జారీ చేసినట్టు క్తికాంత దాస్ చెప్పారు. డీమానిటైజేషన్ తరువాత గత ఐదు వారాలుగా ప్రతిచోటా పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన నాబార్డ్ అధికారుల సమావేశంలో 360 డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల రోజువారీ నగదు అవసరాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఈ మేరకు నాబార్డ్ అధికారులు అందించిన జాబితాను ఆర్ బీఐ కి అందించామన్నారు. వ్యవసాయ రుణాల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రైతులకు నగదును అందిస్తోందని దాస్ ఉద్ఘాటించారు.