రూ.5.5లక్షలకోట్లు విడుదల చేశాం..
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు ఆర్ బీఐ ఇప్పటివరకూ రూ.5.50 లక్షల కోట్ల కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసిందని ఆర్థికవ్యవహారాల ముఖ్య కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. వీలైనంత త్వరగా మరింత కరెన్సీని బ్యాంకులకు అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. రూ 5.50 లక్షల కోట్ల పాత నోట్లు రిజర్వ్ బ్యాంకుకు తిరిగివ వచ్చిన నేపథ్యంలోరూ.5.5 లక్షల కోట్ల తాజా కరెన్సీ నోట్లను మార్కెట్ లోకి జారీ చేసినట్టు క్తికాంత దాస్ చెప్పారు.
డీమానిటైజేషన్ తరువాత గత ఐదు వారాలుగా ప్రతిచోటా పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన నాబార్డ్ అధికారుల సమావేశంలో 360 డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల రోజువారీ నగదు అవసరాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఈ మేరకు నాబార్డ్ అధికారులు అందించిన జాబితాను ఆర్ బీఐ కి అందించామన్నారు. వ్యవసాయ రుణాల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం రైతులకు నగదును అందిస్తోందని దాస్ ఉద్ఘాటించారు.