సాక్షి, ముంబై : హెల్త్‌కేర్ దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1065 కోట్ల లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 270 కోట్ల నష్టం ప్రకటించింది. ఆసమయంలో కంపెనీ వన్‌టైమ్ నష్టం రూ. 1214 కోట్లను భరించాల్సివచ్చింది. తాజా సమీక్షా కాలంలో కంపనీ రెవెన్యూ 17.1 శాతం పెరిగి రూ. 8123 కోట్లను చేరింది. దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు పెరగడం కంపెనీ రెవెన్యూ పెరుగుదలకు దోహదం చేసింది. క్యు2లో కంపెనీ ఎబిటా 17 శాతం దూసుకుపోయి రూ. 1790 కోట్లను చేరింది, కానీ మార్జిన్ మాత్రం ఫ్లాట్‌గా 22 శాతం వద్దే నమోదయింది. సమీక్షా కాలంలో కంపెనీ ఇతర ఆదాయాలు దాదాపు 43 శాతం పడిపోయి రూ. 201 కోట్లకు చేరాయి.
దేశీయ మార్కెట్లో సన్ ఫార్మా నంబర్ 1 స్థానంలో ఉందని, ఫార్మా మార్కెట్ పరిశోధనా సంస్థ జూన్ -2019 నివేదిక ప్రకారం132,000 కోట్ల రూపాయలతో సుమారు 8.2 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంద సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. క్యూ 2 ఆదాయాలపై సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి మాట్లాడుతూ, క్యూ 2, పనితీరు నిరంతర వృద్ధి వేగాన్ని ప్రదర్శిస్తోందనీ, ఈ ఏడాది గైడెన్స్‌కు అనుగునంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశీయ విక్రయాలు 35 శాతం పెరిగి రూ. 2515 కోట్లను తాకగా, ఇతర మార్కెట్లలో విక్రయాలు 49 శాతం పెరిగి 16.1 కోట్ల డాలర్లను చేరాయి.ఇతర మార్కెట్లలో ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలో విక్రయాలు మంచి మెరుగుదల చూపాయి, ఇదే సమయంలో యూఎస్ విక్రయాలు మాత్రం యథాతధంగా కొనసాగాయి. ఈ త్రైమాసికంలో యుఎస్ అమ్మకాలు 424 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఫ్లాట్ . అయితే మొత్తం ఏకీకృత అమ్మకాలలో 30 శాతం వాటా ఉంది. మొదటి సగం అమ్మకాలు 763 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఈ గురువారం ముగింపులో షేరు దాదాపు మూడున్నర శాతం లాభపడి442.50 రూపాయల వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment