
సాక్షి, ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ఫలితాల్లో మరోసారి చతికలపడింది. ఇండిగో పేరెంట్ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గురువారం ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను నమోదు చేసింది. రూ.1,062 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అధిక ఖర్చులు, మార్కెట్ నష్టాలు ఈ లాభాల క్షీణతకు కారణమని ఇండిగో ఫలితాల వెల్లడి సందర్భంగా ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీకి రూ .651.5 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొత్తం ఆదాయం 31 శాతం పెరిగి రూ .8,539.8 కోట్లు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .6,514.1 కోట్లు. రూ .4,282 మిలియన్ల క్యాపిటలైజ్డ్ ఆపరేటింగ్ లీజులపై మార్క్-టు-మార్కెట్ నష్టాలు, 3,190 మిలియన్ల అధిక నిర్వహణ వ్యయం తమ లాభాలను గణనీయంగా ప్రభావితం చేశాయని అని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment