న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆతిథ్య రంగ కంపెనీ మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 41.4 కోట్లకు పరిమితమైంది.
గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 60 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 546 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 515 కోట్ల నుంచి రూ. 575 కోట్లకు పెరిగాయి. కాగా.. ఈ కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన కొత్తగా 4,397 మంది సభ్యులను జత చేసుకుంది. సభ్యత్వ అమ్మకాల విలువ 93 శాతం వృద్ధితో రూ. 194 కోట్లను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment