న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ సెంచురీ టెక్స్‌టైల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 59 శాతం జంప్‌చేసి రూ. 70 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో కేవలం రూ. 44 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,034 కోట్ల నుంచి రూ. 1,242 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 972 కోట్ల నుంచి పెరిగి రూ. 1,125 కోట్లను తాకాయి.
కంపెనీ టెక్స్‌టైల్స్, పల్ప్, పేపర్, రియల్టీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఫలితాల నేపథ్యంలో సెంచురీ టెక్స్‌టైల్స్ షేరు గురువారం నాటి 8 శాతం లాభంతో పోలిస్తే 2 శాతం నష్టంతో 861 వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment