న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆగ్రోకెమికల్స్ సంస్థ బెస్ట్ ఆగ్రోలైఫ్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 5 రెట్లు దూసుకెళ్లి రూ. 130 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 25 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 702 కోట్లను తాకింది.
గత క్యూ2లో రూ. 325 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. తమ ప్లాంట్లు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు కంపెనీ ఎండీ విమల్ అలవాధి పేర్కొన్నారు. కొత్తగా విడుదల చేసిన ప్రొడక్టులకు మంచి స్పందన లభించినట్లు తెలియజేశారు. భవిష్యత్‌లో మరిన్ని విప్లవాత్మక ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఆర్‌అండ్‌డీ బృందం నూతన మాలిక్యూల్స్‌ను ఆవిష్కరించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌ఈలో బెస్ట్ ఆగ్రోలైఫ్ షేరు వారాంతాన 1 శాతం బలపడి రూ. 1,526 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment