లార్సెన్ & టూబ్రో లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.4.68 కోట్లకు పైగా జరిమానా విధించింది. 2021 ఏప్రిల్ 1న కంపెనీలో విలీనమైన ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పన్ను ప్రొసీడింగ్స్‌కు సంబంధించి రూ.4,68,91,352 జరిమానా విధించినట్లు ఎల్ & టీ తాజా ఫైలింగ్‌లో తెలిపింది.
2020-21 అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించి కంపెనీ ఆదాయపు పన్ను మదింపు, రిటర్న్ చేసిన ఆదాయంలో సర్దుబాటు వ్యత్యాసాలపై ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధించినట్లు కంపెనీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, ఈ జరిమానాతో తాము ఏకీభవించనందున ఈ ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేస్తామని, ఉన్నత వేదికపై సానుకూల ఫలితాన్ని ఆశిస్తున్నామని తెలిపింది.
ఎల్& టీ అనేది 27 బిలియన్ డాలర్ల భారతీయ మల్టీ నేషనల్ కంపెనీ. 2022 మార్చి 31 నాటికి ఎల్&టీ గ్రూప్‌లో 93 అనుబంధ సంస్థలు, 5 అసోసియేట్ కంపెనీలు, 27 జాయింట్ వెంచర్లు, 35 ఉమ్మడి కార్యకలాపాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment