
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఆరంభ భారీ పతనంనుంచి ఏమాత్రం కోలుకోని సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత దిగజారాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 1264 పాయింట్లకు పైగా కుప్ప కూలగా, నిఫ్టీ 347 పాయింట్లు పతనమై 8911 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 8950 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. కరోనా , లాక్ డౌన్ సంక్షోభాలతో అంతర్జాతీయముడి చమురు రికార్డు పతనాన్ని నమోదు చేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. దీనికి తోడు వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో ఐటీ సెక్టార్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. కోవిడ్-19 సంక్షోభంతో అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తుండటంతో దాదాపు అన్ని ఐటీరంగ షేర్లు నష్టపోతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు, మార్కెట్ హెవీ వెయిట్ షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. (సంక్షోభం : బాటిల్ కోక్ కంటే..చౌక)
చదవండి : ఆల్ టైం కనిష్టానికి రూపాయి
కరోనా : నడిచి..నడిచి..ఇంటికి చేరబోతుండగా
Comments
Please login to add a commentAdd a comment