సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి స్వల్పంగా తేరుకున్నా...మిడ్‌సెషన్ నుంచి మరింత దిగజారింది. సెన్సెక్స్ 886 పాయింట్లు కోల్పోయి 31122 వద్ద, నిఫ్టీ 240 పాయింట్ల నష్టంతో 9142 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా నిఫ్టీ 31500 స్థాయికి నిఫ్టీ9150 స్థాయికి దిగువన ముగిసాయి. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ముగిసాయి ముఖ్యంగా మెటల్ బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఐటీ రంగ షేర్లు భారీగా నష్టాలను మూట గట్టుకున్నాయి. ఇంకా టెలికాం షేర్లు కూడా నష్టపోయాయి. (ఫెడ్ వ్యాఖ్యలు : మార్కెట్ల పతనం)
పవర్ గ్రిడ్, హిందాల్కో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ , ఎస్‌బీఐ, యాక్సిస్, ఇండస్ ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు నెస్లే, కోటక్ మహీంద్ర, బ్రిటానియా , జీ, మారుతి, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఎల్ అండ్ టీ, యూబీఎల్ లాభపడ్డాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 75.56 వద్ద బలహీనంగా ముగిసింది. ( కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక)
Comments
Please login to add a commentAdd a comment