ముంబై : స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే నమోదైంది. యస్ బ్యాంక్ పరిణామాలతో పాటు కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలతో స్టాక్‌మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. కరోనా వైరస్ ప్రపంచంలో సగం దేశాలకు వ్యాపించడం, కొత్త కేసుల నమోదుతో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. స్టాక్‌మార్కెట్ భారీ నష్టంతో రూ 5 లక్షల కోట్ల మదుపుదారుల సంపద ఆవిరైంది. అమ్మకాల వెల్లువతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్ల నష్టంతో 35,573 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 531 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,457 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.ఇక ఓఎన్‌జీసీ, రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment