ఉక్రెయిన్‌లోని ఒక హైవేపై ఒక హెలికాప్టర్ వ్యతిరేకదిశలో వస్తున్న కారుకి సమీపంగా తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చింది. చూస్తున్న వాళ్లకి హెలికాప్టర్ కారుని క్రాష్ చేస్తుందేమో అనిపించేలా సమీపించింది. క్రాష్ అయ్యే సమయానికి పైలెట్ చాలా చాకచక్యంగా హెలికాప్టర్‌ని పక్కకు తప్పించాడు. చెప్పాలంటే... జస్ట్ వెట్రుకవాసిలో ప్రమాదం తప్పిందనే చెప్పాలి.
అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ 'వెల్‌కమ్ టు ఉక్రెయిన్' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం పైలెట్ చాలా అనుభవశాలి కాబట్టి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా జాగ్రత్త పడగలిగాడని ప్రశంసించారు.
కానీ కొంతమంది నెటిజన్లు మాత్రం ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. అదీగాక రష్యా భూ, వాయు మార్గాల్లో బాంబు దాడులను కూడా వేగవంతం చేసింది. అందువల్ల గగనతలంలోని మిసైల్ దాడులను తప్పించుకునేందుకు, శత్రు రాడార్‌లు గుర్తించకుండా ఉండేలా ఇలా ఉక్రెయిన్ పైలెట్లు తక్కువ ఎత్తులో హెలికాప్టర్‌తో పయనిస్తున్నారు కాబోలు, బహుశా యుద్ధానికి సంబంధించిన సాధన అయ్యి ఉంటుందంటూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ట్వీట్ చేశారు.
Welcome to Ukraine 🇺🇦 pic.twitter.com/LdFhrzwn2m
— Defense of Ukraine (@DefenceU) October 20, 2022
(చదవండి: పంచెకట్టు, షేర్వాణీలో మెరిసిపోతున్న ఒబామా: ఫోటో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment