సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాల నుంచి మరింత పతనమవుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఆరంభంలోనే సెన్సెక్స్ 321 పాయింట్లకు పైగా నష్ట పోయింది. తద్వారా లాభాలకు చెక్ పెట్టింది. అక్కడనుంచి ఏమాత్రం కోలుకోని సెన్సెక్స్ ప్రస్తుతం 617 పాయింట్లు కోల్పోయి 36076వద్ద, నిఫ్టీ 180 పాయింట్ల నష‍్టంతో 10623 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 10700 స్థాయిని కోల్పోయింది. ఫార్మా, ఐటీ మినహా అన్ని రంగాలు షేర్లు నష్టపోతున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, మెటల్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్‌ను పతనం దిశగా తీసుకెళుతోంది.
ఇండస్ ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, జీ ఎంటర్ టైన్‌మెంట్, వేదాంతా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆసియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి. బయోకాన్, డా. రెడ్డీస్, లుపిన్, దివీస్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఆరతి డగ్ర్, లాంటి షేర్లు స్పల్పంగా లాభపడుతున్నాయి. కోవిడ్ -19 కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ ఉండటం సెంటిమెంట్‌నుప్రభావితం చేస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు రీటైల్ ద్రవ్యోల్బణం జూన్ మాసంలో 6.09 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే.ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోతుండగా, ఐటీ షేర్లు లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment