California Car Crash: 15 People Died In US-Mexico Border Incident - Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం : 15 మంది దుర్మరణం

Published Wed, Mar 3 2021 11:14 AM | Last Updated on Wed, Mar 3 2021 1:11 PM

At least 15 people killed in car crash near USMexico border - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా-మెక్సికో సరిహద్దు సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దక్షిణ కాలిఫోర్నియా- మెక్సికో సరిహద్దులోని స్టేట్‌ రూట్‌ 115, ఇంపీరియల్‌ కౌంటీలోని నోరిష్‌ రోడ్‌లో యూఎస్‌వీ కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే కన్నుమూయగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయారు. మరో ఏడుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు ఎల్ సెంట్రో రీజినల్ మెడికల్ సెంటర్ అత్యవసర విభాగం డైరెక్టర్ జూడీ క్రజ్ తెలిపారు. 

ఎస్‌యూవీని ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో అందులో చిక్కుకున్న వారిని, మృతదేహాలను వెలికి తీసేందుకు శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.  బాధితులంతా 15 నుంచి 53 ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులు ఉన్నారని,డ్రైవర్‌ కూడా తీవ్ర గాయాలపాలైనట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు జాతీయ రవాణా భద్రతా బోర్డు వెల్లడించింది. కెపాసిటీకి మించి తీసుకు వెళుతూ ప్రమాదానికి గురైందనీ, దాదాపు సుమారు 27 మంది వరకు ఉన్నట్లు స్తానిక బోర్డర్ డివిజన్ చీఫ్ ఆర్టురో ప్లేటెరో పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మెక్సికన్‌ పౌరులు ఉన్నారని, ఇతరుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement