Bollywood Hero Shah Rukh Khan Crashed Car On Don 2 Sets, Deets Inside | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: షారుక్‌ ఖాన్ చేసిన పనికి కోట్ల రూపాయల లాస్!

Published Wed, May 1 2024 4:03 PM | Last Updated on Wed, May 1 2024 6:53 PM

Bollywood Hero Shah Rukh Khan Crashed Car On Don 2 Sets

స్టార్‌ హీరో షారుక్ ఖాన్ గతేడాది జవాన్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్‌ అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. షారుక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా.. షారుక్ గతంలో డాన్, డాన్‌-2 చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో అతను పనికి మేకర్స్ భారీ నష్టం వాటిల్లిందని కింగ్‌ ఖాన్ సహానటుడు  అలీ ఖాన్  వెల్లడించారు. ఇటీవల  ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ ఖాన్‌.. షారుక్‌  కారును ఎలా క్రాష్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అతను చేసిన పని వల్ల మేకర్స్‌కు రూ. 2.6 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.

అలీ ఖాన్ మాట్లాడుతూ..' బెర్లిన్‌లో ఛేజ్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నాం. షారుక్ ఎడమవైపు.. నేను కుడివైపు ఉన్నా.. ఫర్హాన్ అక్తర్ షాట్‌లో కనిపించకుండా వెనుక సీట్లో దాక్కున్నాడు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ కారు ఛేజింగ్ సీక్వెన్స్‌లో క్రాష్ జరిగింది. షారుక్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బానెట్‌పై లైట్లు, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 2.6 కోట్లు. ఈ ఘటనలో అవన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్ది మా అందరికీ ఎలాంటి గాయాలు కాలేదని' అన్నారు. కాగా.. డాన్ -2 మూవీ 2011లో విడుదలైంది. ఇటీవలే రణవీర్ సింగ్, కియారా అద్వానీతో డాన్ -3 తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్‌  ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement