సాధారణంగా వర్షా కాలంలో రోడ్లన్నీ తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి రోడ్లపై ద్విచక్ర వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదాలు ఎదురైన ఘటనలు బోలెడు ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయాల్లో రోడ్లపై బండి టైర్లకు పట్టులేని కారణంగా వాహనాలు అదుపు తప్పి పడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే మలేషియాలో చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఆ వాహనదారునికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది.
జస్ట్ మిస్ లేదంటే..
ఆ వీడియోలో.. వర్షం పడతుండడంతో రోడ్డంతా తడిసిపోయి తేమగా ఉంది. అంతలో ఓ బైకర్ వేగంగా దూసుకువచ్చాడు. అంతకు ముందే వర్షంతో రోడ్డు చిత్తడిగా మారడంతో ఆ వాహనదారుడు జారిపడ్డాడు. అయితే వెనకనుంచి అదే లేన్‌లో ఓ ట్రక్ వస్తోంది. ఇది గమనించిన ఆ బైకర్ తేరుకుని వెంటనే ఆ ట్రక్కు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఖాళీగా ఉన్న పక్క లేన్ వైపు లేచి పరిగెత్తాడు. కేవలం సెకన్ల వ్యవధిలో ఆ బైకర్ ట్రక్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఈ నెల 24న జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘బాబు చాలా లక్కీ’, ‘జస్ట్ మిస్ లేదంటే’.. అని కామెంట్లు పెడుతున్నారు.
చదవండి: ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment