ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ని హత్య చేయాలని చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్ పోలీసులు అతను లాఫాయోట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్‌లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు.
దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు.
(చదవండి: నమ్మకమే పునాది)
Comments
Please login to add a commentAdd a comment