ముంబై: ఇళ్లలో భూగర్భంలో గదులుండటం సహజం. కానీ వాహనాల్లో ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ స్టోరేజీ గదులను చూశారా.. లేదా. అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూస్తే.. మీకు వాహనాల్లో కూడా అండర్‌గ్రౌండ్ గదులను ఎలా నిర్మించాలో ఓ ఐడియా వస్తుంది. ట్రక్కులో అండర్ గ్రౌండ్ స్టోరేజీ ఓకే కానీ.. దాన్ని ఇలాంటి పనులకు వినియోగించడం కాస్త నిరాశపరుస్తుంది. వీడియోతో షేర్ చేయడంతో పాటు ‘‘నేను, నా కంపెనీ ఇంకా ఇంత ఎదగలేదురా బాబు.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేయమంటున్నారు’’ ఆనంద్ మహీంద్రా.
ఆ వివరాలు.. వీడియోలో ముందు ఓ పికప్ ట్రక్కు కనిపిస్తుంది. చూడ్డానికే అంతా బాగానే ఉంది.. సమస్య ఏంటి.. పోలీసులు ఏం గాలిస్తున్నరబ్బా అనిపిస్తుంది. ఆ తర్వాత వారు ట్రక్కు కింద భాగంలో ఓ డ్రా బయపడింది. బయటకు కనిపించకుండా అమర్చిన డ్రాలో వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా వీరి అతి తెలివికి కళ్లు తేలేస్తారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. తమ పికప్ ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని.. భవిష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత ఇచ్చారు.
‘భయంకరమైన తెలివైనవాడు. సరుకు రవాణాకు కొత్త అర్థం ఇచ్చాడు! మా పరిశోధనా కేంద్రంలో పికప్ ట్రక్ డిజైనింగ్ మార్పుల్లో ఈ ఆలోచనకు తావు లేదు. ఎప్పటికీ ఉండదు’ అంటూ దాన్ని ఉపయోగించిన తీరును మహీంద్రా వ్యతిరేకించారు. అయితే ఆ ట్రక్కు, అందులోని మందు బాటిళ్లను సీజ్ చేసిన ప్రాంతం వివరాల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment