ముంబై : డెడ్లీ వైరస్ స్టాక్‌మార్కెట్లను వణికిస్తోంది. బ్లాక్ మండే షాక్ నుంచి స్టాక్‌మార్కెట్లు కోలుకోకముందే గురువారం మరోసారి కీలక సూచీలు కుప్పకూలాయి. కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడం, గ్లోబల్ మార్కెట్ల పతనంతో స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులపై కరోనా ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2372 పాయింట్ల నష్టంతో 33,324 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 726 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9732 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment