Today Gold Price: Due to CoronaVirus Pandemic, Gold Price Hugely Drop - Sakshi Telugu
Sakshi News home page

గుడ్‌న్యూస్‌ : భారీగా తగ్గిన బంగారం ధరలు

Published Fri, Apr 17 2020 2:19 PM | Last Updated on Fri, Apr 17 2020 3:09 PM

A Rebound In Global Equity Markets Put Pressure On Gold Prices - Sakshi

ముంబై : కొద్దిరోజులుగా భగ్గుమంటూ సామాన్యులకు దూరమైన బంగారం దిగివచ్చింది. ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడంతో శుక్రవారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, స్టాక్‌మార్కెట్ల కుదేలుతో గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత సెషన్‌లో పదిగ్రాముల పసిడి ఏకంగా రూ 47,327కి చేరి సరికొత్త శిఖరాలను తాకింది. అయితే రికార్డు ధరల నుంచి శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ 1396 తగ్గి రూ 45,862 పలికింది.

మరోవైపు కిలో వెండి రూ 1342 దిగివచ్చి రూ 42,913కి చేరింది. ఇక భారత్‌లో మే 3వరకూ లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో బంగారం రిటైల్‌ విక్రయాలు పడిపోవడం కూడా యల్లోమెటల్‌ ధరలు కొంతమేర దిగివచ్చాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది నెలలు బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య సాగవచ్చని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చదవండి : షాకింగ్‌: బంగారం అమ్మేస్తున్నాం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement