సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టంతో మొదలైంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల నడుమ సెన్సెక్స్ 1700 పాయింట్లను కోల్పోయింది. అమెరికా-చైనా ట్రేడ్ వార్, కరోనా వైరస్ కట్టడికోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మరో 2వారాల పొడగింపు, ఏప్రిల్‌లో ఆటో అమ్మకాలు శూన్యం కావడం లాంటి కారణాలు ఈ నష్టాలకు దారితీశాయని మార్కెట్ వర్గాల అంచనా.
ప్రస్తుతం1683 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 32008 వద్ద, నిఫ్టీ 492 పాయింట్లను నష్టపోయి 9369 వద్ద కొనసాగుతోంది. అన్ని రంగాలు నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, మెటల్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కేవలం సిప్లా, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే 1-1.50 శాతం లాభ పడుతున్నాయి. (జియో మరో భారీ డీల్)
Comments
Please login to add a commentAdd a comment