ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘెర రైలు ప్రమాదం కారణంగా వేలాది మంది టికెట్లు రద్దుచేస్తుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అదీగాక ఓ కాంగగ్రెస్ నాయకుడు భక్త చరణ్ దాస్ కూడా ఓ మీడిమా సమావేశంలో అదే వాదన వినిపించాడు. కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుడు మీడియా సమావేశానికి సంబంధించిన క్లిప్‌ను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ మేరకు చరణ్ దాస్ ఆ వీడియో క్లిప్‌లో...ఇలాంటి రైలు ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదని, వందలాది మంది ప్రాణాలు కోల్పోగా..వెయ్యి మంది దాక గాయపడ్డారు.
ఈ ఘటన అందర్నీ బాధించింది. ప్రమాదం తర్వాత వేలాది మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. అని చెబుతున్నట్లు వీడియోలో కనిపించింది. దీనిపై ఐఆర్‌సీటీసీ తీవ్రంగా స్పందించింది. ఇది వాస్తవంగా తప్పు అని..టికెట్ బుకింగ్ రద్దు డేటాను కూడా అందించింది. ఆ ఘటన తర్వాత టికెట్ల రద్దు పెరగలేదని, అందుకు విరుద్ధంగా రద్దులు తగ్గాయని పూర్తి వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది ఐఆర్‌సీటీసీ.
కాగా, ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. పాయింట్ మేషీన్ లేదా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌తో ఏదైన సమస్య లేదా రీకాన్ఫిగరేషన్ లేదా సిగ్నలింగ్ లోపం కారణంగా రైలు ట్రాక్‌లు మార్చారా అనే దానిపై కూలంకషంగా దర్యాప్తు చేస్తోంది సీబీఐ.
This is factually incorrect. Cancellations have not increased. On the contrary, cancellations have reduced from 7.7 Lakh on 01.06.23 to 7.5 Lakh on 03.06.23. https://t.co/tn85n03WPn
— IRCTC (@IRCTCofficial) June 6, 2023
(చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..)
Comments
Please login to add a commentAdd a comment