అనుమానాస్పద బాంబు కారణంగా కూలిన విమానం
ఏకంగా 33 వేల అడుగుల ఎత్తులోనే పేలిపోయింది.
పారాచూట్ లేకపోయిన బతిబట్టగట్టగలిన ఫైట్ అటెండెంట్
మన కళ్లముందే దారుణ ప్రమాదాలను ఫేస్ చేసి మరీ మృత్యుంజయులై బయటపడిన కొందరూ వ్యక్తులును చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నమ్మశక్యం కానీ నిజంలా అద్భుతంగా కనిపిస్తారు ఆయా వ్యక్తులు. అలాంటి మిరాకిల్ లాంటి ఘటనే ఈ మహిళ జీవితంలో చోటు చేసుకుంది. ఆ సంఘటన కారణంగానే ఆమె వార్తల్లో నిలిచింది. పైగా గిన్నిస్ బుక్ ఆప్ రికార్డులకు కెక్కింది కూడా. ఏంటా మిరాకిల్ సంఘటన అంటే..
వివరాల్లోకెళ్తే..ఆ మహిళ పేరు వెన్నా వులోవిచ్. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తోంది. సరిగ్గా జనవరి 26, 1972న యుగోస్లావ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 367లో ఫైట్ అటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఒక భయానక ప్రమాదం జరిగింది. ఓ అనుమానాస్పద బాంబు కారణంగా ఆమె ప్రయాణిస్తున విమానం చెకోస్లోవేయా పర్వతాల మీదుగా కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 27 మంది ప్రయాణికులు, సిబ్బంది అక్కడికక్కడే చనిపోయారు. ఒక్క ఫైట్ అటెండెంట్ వులోవిక్ మాత్రమే ప్రాణాలతో బయటపడింది.
నిజం చెప్పాలంటే వులోవిక్ ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే పేలింది. ఏకంగా 33 వేల అడుగుల నుంచి కూలిపోయింది. ఇక్కడ వులోవిక్ కనీసం పారాచూట్ లేకుండా అంత ఎత్తు నుంచి పడిపోయినా..బతికిబట్టగట్ట గలిగింది. ఇదే అందర్నీ ఒకింత ఆశ్చర్యచకితులను చేసింది. అయితే దర్యాప్తుల బృందం విమానం భూమిపై కూలిపోతున్నప్పుడూ తోక భాగంలోని ఫుడ్ రూమ్‌లో వులోవిక్ చిక్కుపోవడంతో సేఫ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఆ తోక భాగం అటవీ ప్రాంతలో పడిపోయి మంచుతో కప్పబడి ఉండటంతో ఆమె అరుపులు అరణ్యరోదనగా మారాయి.
ఆమె అదృష్టం కొద్ది అక్కడ పనిచేస్తున్న అటవీ వర్కర్లకు ఆ అరుపులు వినపడ్డాయి. వెంటనే వారు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఏకంగా పదిరోజులకు పైగా కోమాలోనే ఉండిపోయింది. ఈ ప్రమాదంలో వులోవిక్ పుర్రెకి తీవ్ర గాయం, రెండు వెన్నుపూసలు చితికిపోవడం, కటి, పక్కటెముకలు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నడుము తాత్కలికి పక్షవాతానికి గురయ్యి కొన్ని రోజులు బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతటి స్థితిలో కూడా ఆమె ఆశను వదులుకోలేదు.
పైగా నిరాశను దగ్గరకు రానివ్వలేదు. నెమ్మదిగా వులోవిక్ పూర్తి స్థాయిలో కోలుకుంది. ఆ తర్వాత ఎయిర్‌లైన్‌లో డెస్క్ జాబ్‌లో విధులు నిర్వర్తించేందుకు తిరిగి వచ్చింది. ఇలా వులోవిక్. మృత్యంజయురాలై నిలవడమే గాక మళ్లీ తన కాళ్లమీద నిలబడి అద్భుతంగా జీవించడంతో .. 1985లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ల కెక్కింది. ఆశకు అసలైన నిర్వచనం ఇచ్చి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ సెర్బియా మహిళ వులోవిక్. తనకు దేవుడిచ్చిన మరో జీవితాన్ని విభిన్న నేపథ్యాల ప్రజల మధ్య అవగాహన పెంచి ,శాంతిగా ఉండేలా చేసేందుకు అంకితం చేసింది. ఇక వుల్‌విక్ 2016లో 66 ఏళ్ల వయసులో మరణించింది. ఇది మాములు మిరాకిల్ స్టోరీ కాదు కదా..!
(చదవండి: అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..)
Comments
Please login to add a commentAdd a comment