ఘోరం: రష్యాలో విమానం కూలి 16 మంది దుర్మరణం | Plane Crashes In Russia Several Killed Says Ministry | Sakshi
Sakshi News home page

Russia Plane: విమానం కూలి 16 మంది మృతి

Published Sun, Oct 10 2021 2:46 PM | Last Updated on Sun, Oct 10 2021 3:11 PM

Plane Crashes In Russia Several Killed Says Ministry - Sakshi

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. తతర్‌స్తాన్‌లో ప్రావిన్సుల్లో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్లు సమాచారం. పారాచ్యూట్ జంపర్లతో ఎల్ 410 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

కాగా ఈ ప్రమాదం నుంచి ముగ్గురు బయటపడినట్లు స్థానికి మీడియా తెలిపింది. ఇటీవల ఆగస్టు 12న తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో క్రొనొటస్కే నేచుర్ రిజర్వ్‌ కురిల్ సరస్సు వద్ద హెలికాప్టర్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తాజాగా ప్రమాదం గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

చదవండి: Xi Jinping: తైవాన్‌ విలీనం తప్పనిసరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement