
ముంబై : అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ముసురుకుంటాయనే ఆందోళనతో ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్‌బీఐ, మారుతి సుజుకి, ఆసియన్ పెయింట్స్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ స్వల్పంగా లాభపడుతున్నాయి.
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 450 పాయింట్ల నష్టంతో 41,012 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 141 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,085 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు అమెరికా-ఇరాన్‌ల పరస్పర హెచ్చరికలతో యుద్ధ వాతావరణం నెలకొనడంతో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. దేశీ మార్కెట్‌లో పదిగ్రాముల పసిడి ఏకంగా రూ 41,000కు ఎగబాకింది.
Comments
Please login to add a commentAdd a comment