ముంబై : కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుండటంతో స్టాక్‌మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. మార్కెట్ల మహాపతనం గురువారం కూడా కొనసాగింది. అమ్మకాల వెల్లువతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 38 నెలల కనిష్టస్ధాయిలో 2000 పాయింట్లు పతనమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 700 పాయింట్ల నష్టంతో 8000 పాయింట్ల దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. గత కొద్ది సెషన్‌లలో పెరుగుతూ వచ్చిన యస్ బ్యాంక్ సైతం నష్టాల బాట పట్టింది. బజాజ్ ఫైనాన్స్ 13 శాతం, కొటాక్ మహింద్ర, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 10 శాతం పైగా నష్టపోతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ఏడు శాతం నష్టాలతో ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment