చీతా హెలికాప్టర్‌ క్రాష్‌ ...పైలెట్‌ మృతి | Army Cheetah Helicopter Crashed Pilot Dead And Co Pilot Injured | Sakshi
Sakshi News home page

చీతా హెలికాప్టర్‌ క్రాష్‌ ...పైలెట్‌ మృతి

Published Wed, Oct 5 2022 2:31 PM | Last Updated on Wed, Oct 5 2022 3:58 PM

Army Cheetah Helicopter Crashed Pilot Dead And Co Pilot Injured - Sakshi

న్యూఢిల్లీ: చీతా హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ కూలిపోయినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్‌, మృతి చెందగా, కో పైలెట్‌  తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం తవాంగ్‌ ప్రాంతంలో ఉదయం 10 గం.ల సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ చీతా హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్‌లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఇద్దరు పైలెట్‌లను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఐతే లెఫ్టినెంట్‌ సౌరభ యాదవ్‌ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కో పైలెట్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇదే ఏడాది మార్చిలో మరో చీతా హెలికాప్టర్‌ జమ్ము కాశ్మీర్‌ సరిహద్దుల్లో కూలిన సంగతి విధితమే. ఆఘటనలో కూడా పైలెట్‌ మృతి చెందగా, కోపైలెట్‌కి తీవ్ర గాయాలపాలయ్యాడు. 

(చదవండి: ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్‌’పై దర్యాప్తు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement