
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి.
ముంబై : కరోనా వైరస్ భయాలు గ్లోబల్ మార్కెట్లను వెంటాడిన ఫలితంగా స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. డెడ్లీ వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మెటల్, ఐటీ, రియల్‌ఎస్టేట్ సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్, టాటా ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 1110 పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 313 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,319 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.