దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్న బెంచ్ మార్క్ సూచీలు ఏమాత్రం కోలుకోలేపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లలో భారీ నష్టాల ప్రభావంతో భారతీయ మార్కెట్‌లు భారీగా వెనక్కి తగ్గాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,222.55 పాయింట్లు లేదా 2.74% క్షీణించి 78,759.40 వద్దకు పడిపోయింది. నిఫ్టీ కూడా 667.75 పాయింట్లు లేదా 2.70% శాతం నష్టపోయి 24,049.95 వద్దకు క్షీణించింది.
రంగాలవారీగా అన్ని సూచీలు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో టాటా మోటార్స్ టాప్ లూజర్‌గా ఉండగా, టాటా స్టీల్, మారుతీ, అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ మరియు జెఎస్‌డబ్ల్యు స్టీల్ భారీగా క్షీణించాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment