కేటుగాళ్ల కొత్త ప్లాన్‌.. 14కిలోల బంగారాన్ని మట్టిలో పాతిపెట్టి..  | Gold Seized Near India-Bangladesh Border | Sakshi
Sakshi News home page

కేటుగాళ్ల కొత్త ప్లాన్‌.. 14కిలోల బంగారాన్ని మట్టిలో పాతిపెట్టి.. 

Published Sun, Sep 3 2023 9:15 PM | Last Updated on Sun, Sep 3 2023 9:15 PM

Gold Seized Near India-Bangladesh Border - Sakshi

కోల్‌కత్తా: బంగారం తరలింపు కోసం కొందరు కేటుగాళ్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టులో, కార్లలో బంగారం తరలిస్తున్న ఘటనలు చూసే ఉంటాం. కానీ.. కొందరు కేటుగాళ్లు ఏకంగా బంగారాన్ని అడవిలో దాచిపెట్టి.. తరలింపునకు ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో భద్రతా దళాలు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. భారత్‌ - బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో సెప్టెంబర్‌ 2న సోదాలు చేయగా.. ఓ గుంత తవ్వి మట్టికింద అక్రమంగా దాచి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు, ముక్కలను సీజ్‌ చేశారు. 

ఈ సందర్బంగా అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉంటుందని తెలిపార. ఈ బంగారం ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా, బంగారం అక్రమ తరలింపులో వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు అతడికి సహాయకుడిగా ఉన్న మరొకరిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: ఎల్బీనగర్‌లో దారుణం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement