శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో గడిచిన 48 గంటల్లో పలు ప్రాంతాల్లో ముంచుకొచ్చిన మంచుఖండాలతో నలుగురు బీఎస్‌ఎఫ్ సైనికులు మరణించారు. బండిపార జిల్లా గురెజ్, రాంపురా, కుప్వారా జిల్లాలోని మచిల్ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా ఆవరించి అనూహ్యంగా మంచుఖండాలు ముంచెత్తడంతో విధి నిర్వహణలో నిమగ్నమైన సైనికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మచిల్‌లో విధినిర్వహణలో ఉన్న నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది. గుల్‌మార్గ్ సెక్టార్‌లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌కు చెందిన ఓ సైనిక జవాన్ మంచుకొండల్లోకి జారిపడటంతో గల్లంతయ్యాడని ఆర్మీ అధికారులు తెలిపారు. గల్లంతైన జవాన్‌ను హవాల్ధర్ రాజేంద్ర సింగ్ నేగిగా గుర్తించారు. గల్లంతైన జవాన్లను కాపాడేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment