
పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి తుపాకీ కాల్పులకు గాయపడిన యువకుడిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
జమ్మూ: పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి తుపాకీ కాల్పులకు గాయపడిన యువకుడిని వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్‌లోని భోల్లియన్ డా కొథే గ్రామానికి చెందిన ఫరూఖ్ అహ్మద్ సైనికులు హెచ్చరిస్తున్నా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. దీంతో సైనికులు అతనిపై కాల్పులు జరపగా బుల్లెట్ తగిలి పడిపోయాడు.
చనిపోయాడని మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన సిబ్బంది.. అతను బతికే ఉండటంతో వైద్యశాలకు తరలించారు. అతని వద్ద ఆయుధాలు లభించలేదనీ, మాదకద్రవ్యాల మత్తులో ఉన్నట్లు అధికారులు చెప్పారు.