చొరబాటుదారులను తిప్పిపంపిన బీఎస్ఎఫ్ | BSF prevents entry of 300 Bangladesi nationals in Tripura | Sakshi
Sakshi News home page

చొరబాటుదారులకు షాకిచ్చిన బీఎస్ఎఫ్

Published Sun, Jun 26 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

చొరబాటుదారులను తిప్పిపంపిన బీఎస్ఎఫ్

చొరబాటుదారులను తిప్పిపంపిన బీఎస్ఎఫ్

అగర్తల: భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 300 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అడ్డుకొని వెనక్కు పంపింది. త్రిపురలోని ఖోవాయి జిల్లా చాంపాహార్ ప్రాంతం నుంచి శనివారం రాత్రి భారత్ లోకి అక్రమంగా చొరబాడేందుకు యత్నించిన వీరిని తింపి పంపినట్టు  బీఎస్ఎఫ్ పోలీస్ కంట్రోల్ ఎస్పీ ఉత్తమ్ బౌమిక్ తెలిపారు.

వీరంతా బంగ్లాదేశ్ లోని  హబిగంజ్ జిల్లా చునారగడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులని, వీరందరికీ ఖోవాయి జిల్లా యంత్రాంగం, బీఎస్ఎఫ్ సిబ్బంది  రాత్రి భోజనం ఏర్పాటు చేసి ఉదయం బంగ్లాదేశ్ కు తిప్పిపంపామని ఆయన వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement