మర్యాలను సందర్శించిన బీఎస్‌ఎఫ్‌ బృందం | bsf team visited to maryala | Sakshi
Sakshi News home page

మర్యాలను సందర్శించిన బీఎస్‌ఎఫ్‌ బృందం

Published Fri, Sep 9 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

మర్యాలను సందర్శించిన బీఎస్‌ఎఫ్‌ బృందం

మర్యాలను సందర్శించిన బీఎస్‌ఎఫ్‌ బృందం

బొమ్మలరామారం : మండలంలోని మర్యాలలో ఏర్పాటు కానున్న బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌ హెడ్‌ క్వాటర్స్‌ నిర్మాణ స్థలాన్ని శుక్రవారం సంబంధిత అధికారుల బృందం సభ్యులు సందర్శించారు. వారం రోజుల్లో హెడ్‌ క్వాటర్స్‌ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. నిర్మాణ పనులకు కావలసిన మౌలిక వసతులు కరెంట్, రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేందుకు  క్షేత్ర స్థాయి నివేదిక కోసం వచ్చామన్నారు. బృందంలో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌‡కరమ్‌జిత్‌ సింగ్, ఏఎస్‌ఐ వెంకటేష్, వినయ్‌ కుమార్, వారి వెంట ఎస్‌ఐ నర్సింహరావు, సర్పంచ్‌ చీర సత్యనారయణ, ఉప సర్పంచ్‌ ముద్దం శ్రీకాంత్‌రెడ్డి, వార్డు సభ్యులు ఉన్నారు.S∙S
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement