‘పాక్‌తో లింక్‌ పెడుతున్నారు.. తేజ్‌ తాజా వీడియో’ | My Phone Being 'Tampered With' to Link Me to Pak: Tej Bahadur in New Video | Sakshi
Sakshi News home page

‘పాక్‌తో లింక్‌ పెడుతున్నారు.. తేజ్‌ తాజా వీడియో’

Published Thu, Mar 2 2017 6:55 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

‘పాక్‌తో లింక్‌ పెడుతున్నారు.. తేజ్‌ తాజా వీడియో’

‘పాక్‌తో లింక్‌ పెడుతున్నారు.. తేజ్‌ తాజా వీడియో’

న్యూఢిల్లీ: తమకు సరైన ఆహారం పెట్టడం లేదని, సరిహద్దులో సైన్యం పరిస్థితి దారుణంగా ఉందని వీడియో సందేశంలో పెట్టి దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన బీఎస్‌ఎఫ్‌ జవాను తేజ్‌ బహదూర్‌ మరో కలకలం సృష్టించాడు. తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు. అయితే, గతంలో ఫిర్యాదు చేసిన ఆయన ఈసారి పిటిషన్‌ రూపంగా ఆ వీడియో సందేశం పంపించాడు. స్వరాజ్‌ సమాచార్‌ అనే ఫేస్‌బుక్‌ పేజీలో తేజ్‌ బహదూర్‌ తాజా వీడియోను పబ్లిష్‌ చేశాడు. తన మొబైల్‌ ఫోన్‌ను పై అధికారులు స్వాధీనం చేసుకున్నారని, పగులగొట్టారని, మానసికంగా హింసిస్తున్నారని తాజా వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

‘నేను నా ఫోన్‌ను తప్పుగా ఉపయోగించానని చెబుతున్నారని నాకు తెలిసింది. నేను ప్రధాని దృష్టికి ఆహార సమస్యను, నాణ్యత విషయాన్ని తీసుకెళ్లాలనుకున్న మాట వాస్తవం. అది నిజమైన సమస్య. అందుకు ఇప్పుడు నన్ను మానసికంగా హింసిస్తున్నారు. దేశంలో అవినీతి అంతం చేయాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. నేను నా శాఖలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాలని అనుకుంటున్నాను. నా ఫోన్‌ను ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. తనకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని నిరూపించేందుకు ఫోన్‌లో ఏవో అంశాలు జోడిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

వాస్తవానికి ఈ వీడియో ఫిబ్రవరి మూడో వారంలో రికార్డు చేసి ఉంటారని బీఎస్‌ఎఫ్‌ అధికారులు చెబుతున్నారు. అందులో ఉన్నది తేజ్‌ బహదూరేనని, అతడి వద్దకు భార్య వెళ్లినప్పుడు ఈ వీడియో రికార్డు చేసి ఉండొచ్చని, విచారణ కోసం గతంలో అతడి వద్ద ఉన్న ఫోన్‌ను తీసుకున్నట్లు తెలిపారు. అతడి ఫేస్‌బుక్‌ పేజీలో కొంతమంది పాకిస్థాన్‌ స్నేహితులు ఉన్నట్లు గుర్తించామని, వారి ప్రభావం అతడిపైన పడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

సంబంధిత మరిన్ని వార్తలకై చదవండి
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో

నా భర్తను నిర్బంధించారు: జవాన్ భార్య


‘తేజ్‌ను అరెస్టు చేయలేదు.. వేరే చోట ఉన్నాడు’

బీఎస్‌ఎఫ్‌ జవాను ఫేస్‌బుక్‌ ఖాతాపై నిఘా

ఆ జవాను ఫేస్‌బుక్‌ అకౌంట్లో 500 మంది పాకిస్తానీలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement