విశాఖపట్నం: ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేశారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. కాగా అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
బీఎస్ఎఫ్ జవాన్లు చిత్రకొండ నుంచి జాన్బాయ్ వైపు వెళ్తుండగా మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. చిత్రకొండ సమీపంలో జవాన్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్ల మృతి
Published Wed, Aug 26 2015 9:40 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement
Advertisement