కోల్కతా: భారత సరిహద్దు రక్షణ బలగం(బీఎస్ఎఫ్) దాదాపు రూ.ఎనిమిది లక్షల దొంగనోట్లను స్వాధీనం చేసుకొంది. వాటిని సీజ్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా సరిహద్దు వద్ద నుంచి తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా బలగాలు గుర్తించి నిలువరించాయి. బంగ్లాదేశ్కు చెందిన కొందరు చొరబాటుదారులు ఒక బ్యాగును బంగ్లా సరిహద్దు నుంచి భారత్ సరిహద్దులోకి విసిరేశారు. దీనిని బోర్డర్ బలగాలు గమనించడంతో వాటిని తీసుకునేందుకు ప్రయత్నించిన భారత్లోని చొరబాటుదారులు వీలుకాక చివరికి పారిపోయారు. దీంతో బ్యాగును స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ బలగాలు దానిని తెరిచి చూసి అందులో ఎనిమిది లక్షల రూపాయల దొంగనోట్లు ఉన్నట్లు గుర్తించారు.