పాకిస్తాన్కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్! | Rajnath warns pakistan in case of attacks | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్!

Oct 8 2016 10:22 PM | Updated on Mar 23 2019 8:09 PM

పాకిస్తాన్కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్! - Sakshi

పాకిస్తాన్కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్!

పాకిస్తాన్ పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీరియస్ అయ్యారు.

బర్మర్: పాకిస్తాన్ పై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీరియస్ అయ్యారు. ఇప్పటివరకూ భారత్ ఏ సమయంలోనూ మొదటగా కాల్పులు జరపలేదని, కానీ పాక్ కాల్పులకు తెగబడితే మాత్రం.. ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీ పేల్చే తూటాలకు లెక్క ఉండదని స్పష్టంచేశారు. రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాలో బీఎస్ఎఫ్ బలగాల ఔట పోస్ట్ ను శనివారం సందర్శించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే తీరుగా భారత్ వ్యవహరిస్తుందన్నారు.

పాక్ భూభాగాలను ఆక్రమించాలని భారత్ ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పారు. గురువారం నౌగామ్ సెక్టార్లో భారత ఆర్మీ సీజ్ చేసిన గ్రెనెడ్లపై పాక్ కు సంబంధించిన గుర్తులు ఉన్నట్లు మరోసారి ప్రస్తావించారు. ఉడీ ఉగ్రదాడుల తర్వాత పాక్ చర్యలను భారత్ ఉపేక్షించడం లేదు. పాక్ మిలిటెంట్ల చొరబాట్లను పూర్తిగా చేసేందుకు సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం జరుగుతోందని, 2018 డిసెంబర్ కల్లా మొత్తం సరిహద్దును మూసేస్తామని శుక్రవారం రాజస్తాన్ జైసల్మేర్‌లో సరిహద్దు భద్రతపై సమీక్ష అనంతరం రాజ్ నాథ్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement