
పాతిక మంది బీఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశ రాజధానిని వణికిస్తోంది. ఢిల్లీలో ఆదివారం 25 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బందికి కరోనా పరీక్షలో పాజిటివ్‌గా వెల్లడైంది. దీంతో బీఎస్‌ఎఫ్ సిబ్బందిలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 42కు పెరిగింది. కాగా ఢిల్లీలో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న 122 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకూ 3738కి చేరగా 61 మరణాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 40,263కు ఎగబాకగా మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1306కు పెరిగింది. మరోవైపు సోమవారం నుంచి దేశమంతటా రెడ్‌జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో పలు నియంత్రణలతో సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తారు.