శ్రీనగర్:
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న బీఎస్‌ఎఫ్ శిబిరంపై ఫిదాయీన్(ఆత్మాహుతి) దళం మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు దాడి జరిపింది. కాల్పులు జరుపుకుంటూ వచ్చిన ముష్కరులు బీఎస్‌ఎఫ్ శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. జవాన్లు కూడా దీటుగా కాల్పులు జరిపారు.
ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఇప్పటి వరకు ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఉగ్రదాడితో అప్రమత్తమైన జవాన్లు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులను, ప్రయాణికులను, వాహనాలను ఎయిర్ పోర్టు దారిలోకి అనుమతించడం లేదు. అన్ని విమానసర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉ.11.30కి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.