
'చేతులు ముడుచుకుని కూర్చోవద్దని చెప్పా'
సరిహద్దులో పాకిస్థాన్ హద్దుమీరితే తగినవిధంగా గుణపాఠం చెబుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.
న్యూఢిల్లీ: సరిహద్దులో పాకిస్థాన్ హద్దుమీరితే తగినవిధంగా గుణపాఠం చెబుతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. పాకిస్థాన్ కాల్పులు జరిపితే చేతులు ముడుచుకుని కూర్చోనక్కర్లేదని బీఎస్ఎఫ్ కు చెప్పామని ఆయన వెల్లడించారు. దాయాది దేశం రెచ్చగొడుతున్నా ఇంకెన్నాళ్లు శాంతి కపోతాలు ఎగరేస్తామని ఆయన ప్రశ్నించారు.
ఆర్థిక రాజధాని ముంబైపై మరోసారి 26/11 తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.