ఆ జవాను ఫేస్‌బుక్ అకౌంట్లో 500 మంది పాకిస్తానీలు
ఆ జవాను ఫేస్‌బుక్ అకౌంట్లో 500 మంది పాకిస్తానీలు
Published Sat, Feb 11 2017 8:45 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) జవాను తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్‌బుక్ స్నేహితుల్లో 500 మంది పాకిస్తానీలు ఉన్నారు. తేజ్ ఫేస్‌బుక్ అకౌంట్ ను పరిశీలించగా అతని ఫ్రెండ్స్‌లో 17శాతం మంది పాకిస్తానీలు ఉన్నట్లు తేలిందని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వారిలో ఎంతమందికి పాకిస్తానీ నిఘా సంస్ధ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. తేజ్ ఒరిజినల్ అకౌంట్ మాత్రమే కాక మరో 39 నకిలీ అకౌంట్లను కలిగి ఉన్నాడని చెప్పారు. దీనిపై స్పందించిన ఓ బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి తేజ్ ఫేస్‌బుక్ అకౌంట్లో మూడు వేల మంది స్నేహితులు ఉన్నట్లు వెల్లడించారు. జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద తేజ్‌ను బీఎస్‌ఎఫ్ విధులకు పంపింది. కాగా, గత నెల మొదటి వారంలో బోర్డర్లో కాపలాకాస్తున్న జవానులకు పెడుతున్న ఆహారం గురించి తేజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement