పంజాబ్ : భారత్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న మరో దురాగతం వెల్లడైంది. ఫిరోజ్‌పూర్‌లో బీఎస్‌ఎఫ్ అవుట్ పోస్ట్ వద్ద రెక్కీ నిర్వహించిన పాక్ గూఢచారిగా అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్ పోస్ట్ ఫోటోలు తీసేందుకు గూఢచారి ప్రయత్నించాడు.
యూపీలోని మొరదాబాద్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్న అనుమానితుడి నుంచి పాకిస్తాన్‌కు చెందిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డును బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఈ నెంబర్ 8 పాక్ గ్రూప్‌లతో యాడ్ అయి ఉండగా, మరో ఆరు పాకిస్తాన్ ఫోన్ నెంబర్లను కూడా అధికారులు అతడి నుంచి గుర్తించారు. కాగా, సరిహద్దుల వద్ద భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ పోస్ట్‌ల వద్ద అనుమానితుడి రెక్కీ కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment