బీఎస్‌ఎఫ్‌లో భారీగా కొలువులు.. 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | BSF Constable Tradesman Recruitment 2022: Full Details Inside | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్‌లో భారీగా కొలువులు.. 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published Tue, Feb 22 2022 10:39 AM | Last Updated on Tue, Feb 22 2022 12:24 PM

BSF Constable Tradesman Recruitment 2022: Full Details Inside - Sakshi

ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసి సరిహద్దు రక్షణ దళంలో పనిచేయాలనుకునే వారికోసం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) ఉద్యోగ ప్రకటన వెలువడింది. దీనిలో భాగంగా కానిస్టేబుల్‌(ట్రేడ్‌మెన్‌) పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 2788. వీటిల్లో పురుషులకు 2651, మహిళలకు 137 పోస్టులను కేటాయించారు. ఫిజికల్‌ టెస్టులు, ట్రేడ్‌ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత
► పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐటీఐ) నుంచి ఏడాది సర్టిఫికేట్‌ కోర్సు/రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సు చదివి ఉండాలి.
► వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
► ఎత్తు: పురుష అభ్యర్థులు ఎత్తు 167.5 సెం.మీ, ఛాతీ కొలత 78–83 సెం.మీ మ«ధ్య ఉండాలి. స్త్రీలు 157 సెం.మీ ఎత్తు ఉంటే సరిపోతుంది.
చదవండి: 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే..

ఎంపిక ఇలా
ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్‌ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
► హైట్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే పీఈటీ పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో పురుçషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పరుగెత్తాలి. స్ట్రీలు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 8.30 నిమిషాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది.
రాత పరీక్ష
► పైన టెస్టులను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించే ఈ పరీక్షను ఓఎంఆర్‌ షీట్‌ మీద రాయాలి. అంటే.. ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది.
►   రాత పరీక్షలో మొత్తం 100 మార్కులకు–100 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ నాలెడ్జ్, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ ఎబిలిటీ టు అబ్జర్వ్‌ ద డిస్టింగ్విష్డ్‌ ప్యాట్రన్స్, బేసిక్‌ నాలెడ్జ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌/హిందీ.. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 2 గంటలు.

అర్హత మార్కులు
జనరల్‌ అభ్యర్థులు కనీసం 35శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఇలా
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఖాళీలకు అనుగుణంగా సొంత రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ సమయంలో జనరేట్‌ అయ్యే ఐడీ, పాస్ట్‌వర్డ్‌లను సేవ్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులు సదరు రిజిస్ట్రేషన్‌ ప్రింట్‌అవుట్‌ తీసుకోవాలి. ఇది రికార్డు నిమిత్తం భద్రపరుచుకోవాలి. దరఖాస్తును పోస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో కరస్పాండెన్స్‌ అంతా ఈమెయిల్‌/ఎస్‌ఎంఎస్‌ ద్వారానే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు తప్పులు లేకుండా ఫోన్, మెయిల్‌ ఐడీ సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వ/పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారు నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు టెన్త్‌ సర్టిఫికేట్‌ అలాగే రెండేళ్ల పని అనుభవానికి సంబంధించి సర్టిఫికేట్, రెసిడెన్సీ, కాస్ట్‌ సర్టిఫికేట్‌(అవసరమైతే)లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

వేతనాలు
పే మ్యాట్రిక్స్‌ లెవల్‌–3 ప్రకారం–నెలకు రూ.21,700–రూ69,100–వరకు వేతనంగా చెల్లిస్తారు. ఇవేకాకుండా ఇతర అలవెన్సులు కూడా పొందుతారు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 01, 2022
వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement