
నకిలీ 2000 నోట్ల కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారీగా నకిలీ 2000 నోట్లు పట్టుబడడం కలకలం రేపింది. మాల్ద జిల్లాలో ఓ వ్యక్తి వద్ద నుంచి రూ 1,96,000 విలువగల నకిలీ నోట్లను బీఎస్‌ఎఫ్(బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) స్వాధీనం చేసుకుంది.
బీఎస్‌ఎఫ్ సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో.. నిజిముల్ హక్ అనే వ్యక్తి వద్ద 98 ఫేక్ కరెన్సీ నోట్లను గుర్తించారు. అతడిని బైష్‌నబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు బీఎస్‌ఎఫ్ సిబ్బంది వెల్లడించారు. ఇప్పటివరకు 2017లో సుమారు 30 లక్షల విలువగల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్ దక్షిణ బెంగాల్ విభాగం వెల్లడించింది.