
స్మగ్లర్ అనుకొని కాల్చారు!
బీఎస్‌ఎఫ్ జవాన్లు స్మగ్లర్ అనుకొని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు
అగర్తలా: ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీఎస్‌ఎఫ్ జవాన్లు స్మగ్లర్ అనుకొని ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో అరాబర్ రహ్మాన్(38) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
భారత్- బంగ్లాదేశ్ బార్డర్‌లోని బలేర్డెపా గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ సిబ్బంది.. అర్థరాత్రి సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన రహ్మాన్‌పై స్మగ్లర్‌గా భావించి కాల్పులు జరిపారు అని పోలీసు అధికారి ఉత్తమ్‌కుమర్ బౌమిక్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మాన్ అమాయకుడని.. ఎలాంటి స్మగ్లింగ్‌తో అతడికి సంబంధం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.