ఇద్దరు పాక్ చొరబాటుదారులు హతం | Two Pakistan intruders shot dead by BSF; 12kg heroin, rifle seized | Sakshi
Sakshi News home page

ఇద్దరు పాక్ చొరబాటుదారులు హతం

Published Sun, Mar 29 2015 12:28 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

అమృతసర్: భారత సరిహద్దులో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను భారత సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది.

అమృతసర్: భారత సరిహద్దులో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను భారత సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది. వారి వద్ద నుంచి దాదాపు రూ.60కోట్ల విలువైన12 కేజీల హెరాయిన్, ఒక రైఫిల్ను స్వాధీనం చేసుకుంది.  ఈ విషయంపై బీఎస్ఎఫ్ డీఐజీ మాట్లాడుతూ ఆదివారం ఉదయం రతన్ ఖుర్ద్లోని ఔట్ పోస్ట్ నుంచి ఇద్దరు పాక్ చొరబాటుదారులు చేతిలో ఏకే 47 తుపాకీ, చేతిలో ఓ మూటతో వచ్చేందుకు ప్రయత్నించారని అన్నారు.

తాము గమనించడం చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతోపాటు లొంగిపోవాలని చెప్పినా వినకుండా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, దీంతో బలగాలు వారిపై బలగాలు కాల్పులు జరిపి హతమార్చాయాని తెలిపారు.  ఇటీవల 24 కేజీల హెరాయిన్ను కూడా ఇదే మార్గంలో బీఎస్ఎఫ్ గుర్తించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement